సీఐఐ`ఐజీబీసీ నుండి ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు అందుకున్న రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపు

విధాత:దక్షిణ మధ్య రైల్వేలో నిరంతరం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) వారిచే ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు లభించింది. వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌లో చేపట్టిన ఉత్తమమైన వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాయనపాడు వర్క్‌షాపుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించింది. ‘‘ఎన్విరాన్‌మెంట్‌ బెస్ట్‌ ప్రాక్టిస్‌2021’’ 8వ సీఐఐ జాతీయ అవార్డు కోసం జులై నెలలో […]

సీఐఐ`ఐజీబీసీ నుండి ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు అందుకున్న రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపు

విధాత:దక్షిణ మధ్య రైల్వేలో నిరంతరం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు మరోసారి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) వారిచే ‘‘మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాజెక్టు’’ అవార్డు లభించింది. వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌లో చేపట్టిన ఉత్తమమైన వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాయనపాడు వర్క్‌షాపుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించింది. ‘‘ఎన్విరాన్‌మెంట్‌ బెస్ట్‌ ప్రాక్టిస్‌2021’’ 8వ సీఐఐ జాతీయ అవార్డు కోసం జులై నెలలో సీఐఐ’ఐజీబీసీ వారిచే ఈ పోటీలు నిర్వహించబడినాయి. దీనికి 200 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా వాటిలో ఉత్తమ ప్రాజెక్టులను ప్రదర్శించిన 36 కంపెనీలను ఎంపిక చేశారు. వాటిలో రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాపుకు సంబంధించిన ప్రాజెక్టుకు ఉత్తమమైన పర్యావరణ ప్రాజెక్టుగా ఎంపికై ట్రోఫీ మరియు సర్టిఫికెట్‌ లభించింది.

సీఐఐఐజీబీసీ నుండి ప్రత్యేక గుర్తింపు పొంది ప్రతిష్టాత్మమైన సర్టిఫికెట్‌ అందుకున్న రాయనపాడు వర్క్‌షాపు చీఫ్‌ వర్క్‌షాపు మేనేజర్‌కి మరియు వారి బృందానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య శుభాకాంక్షలు తెలియజేశారు.వారి రోజువారి విధులలో పర్యావరణ పరిరక్షణ చర్యల కొరకు నిర్విరామంగా కృషి చేసిన ఫలితంగా ఈ ప్రత్యేక అవార్డు అందుకున్నారని ఈ యూనిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు మరియు కార్బన్‌ ఉద్గారాల నివారణకు తోడ్పడే విధంగా అన్ని డివిజన్లు మరియు వర్క్‌షాపులు అనేక వినూత్న కార్యక్రమాలతో పర్యావరణ అనుకూల చర్యలు చేపడుతూ అనేక సర్టిఫికెట్లు మరియు అవార్డులు అందుకోవడంపై జనరల్‌ మేనేజర్‌ ఆనందం వ్యక్తం చేశారు.గతంలో 2021 ఫిబ్రవరి నెలలో ఈ వర్క్‌షాపు సీఐఐఐజీబీసీ వారిచే గ్రీన్‌ కోప్లాటీనియం రేటింగ్‌ పొందింది.