Viral: వామ్మో.. పాముల ట్రయంగిల్ లవ్ స్టోరీ? నడి రోడ్డుపై మూడు పాముల సయ్యాట! Video

విధాత: సాధారణంగా మనుషుల్లో ట్రయంగిల్ లవ్ స్టోరీ(ముక్కోణపు ప్రేమకథ)లు చూస్తుంటాం. జంతువుల్లోనైతే ఓ ఆడ జంతువు సంభోగం కోసం మగజంతువులు పోటీ పడి ఆధిపత్య పోరాటాలు చేస్తుంటాయి. సింహాలు, పులుల వంటి వన్యప్రాణుల్లో ఈ తరహా పోరాటాలు సాధారణం. అయితే పాముల్లో ఓ ట్రయంగిల్ లవ్ స్టోరీ వీడియో వైరల్ గా మారింది.
ఓ చెరువు సమీపంలోని రోడ్డు మీదుగా ఆవలి వైపు వెలుతున్న ఓ ఆడ పామును మరో రెండు పాములు తోడు కోరుతూ అనుసరించాయి. ఆడ పామును ఓ మగ పాము పెన వెసుకుని శృంగార సయ్యాటల్లో మునిగింది. పక్కనే ఉన్న మరో పాము నేను కూడా నీ ప్రేమకోసమే వచ్చానన్నట్లుగా అదికూడా ఆ రెండు పాముల మధ్య దూరి శృంగార సయ్యాటలో భాగమైంది. ఇంకేముంది ఆ మూడు పాములు పరస్పరం పెనవేసుకుని రోడ్డుమీద దొర్లుతూ కనిపించాయి.
ఆడ పాము పొందు కోసం రెండు మగ పాములు పెనుగులాడాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఫారెస్టు అధికారి సుశాంతనంద పోస్టు చేశారు. తోడు కోసం పాములు సాగించిన ఆధిపత్య పోరాటంగా ఆయన ఈ ఘటనను అభివర్ణించారు. వీడియో చూసిన నెటిజన్లు ఒక రాణి కోసం ఇద్దరు రాజుల పోరాటమంటూ కామెంట్ చేశారు.