Viral | వీళ్ల‌కేం పుట్టిందిరా.. పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు!

  • By: sr    videos    Apr 27, 2025 3:01 PM IST
Viral | వీళ్ల‌కేం పుట్టిందిరా.. పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు అమ్మాయిలు!

Viral |

విధాత: ఆధునిక నాగరికత వెర్రితలలు వేస్తున్న సందర్భాలు అనేకం చూస్తుంటాం. ఆడ మగ పెళ్లి చేసుకోవడం సాధారణంగా అంతటా అందరికి తెలిసిందే. హిజ్రాలు పెళ్లి చేసుకున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తుంటాయి. పాశ్చత్త దేశాల్లో ఇద్దరు మహిళల సహజీవనం సాధరణమే. పెళ్లిళ్లు.. సహజీవనం అంశాలలో పాశ్చత్త నాగరికతల ప్రభావం నేటికి సనాతన సంప్రదాయ సంస్కృతులు బలంగా ఉన్న ఇండియాపై ప్రభావం చూపుతున్నప్పటికి అది నామామాత్రంగానే సాగుతోంది.

అయితే తాజాగా ఇద్దరు యువతుల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంప్రదాయ పెళ్లి తంతు తరహాలోనే వారిద్ధరు మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వడం అందరిని విస్మయానికి గురి చేసింది. అయితే సాధరణంగా వధూవరుల మధ్య జరిగే పెళ్లిలో అమ్మాయి మెడలో అబ్బాయి మూడుముళ్లు వేయడం అందరికి తెలిసిందే. అయితే ఇద్దరి అమ్మాయిల ఈ వింత పెళ్లిలో మాత్రం చెరొక తాళి చేతపట్టుకుని పరస్పరం ఒకరి మెడలో మరొకరు తాళి కట్టడం మరో విచిత్రం.

అమ్మాయిల వింత పెళ్లి వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి అరాచకంరా.. నాయనా అని కొందరు.. పోనిలే ఇద్దరి పురుషల లైఫ్ సేఫ్ అయ్యిందని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఇరువురు అమ్మాయిలు కూడా ఒకరి మెడలో మరొకరు తాళి కట్టి..పరస్పరం కాళ్లు మొక్కిన తీరు చూస్తే వీరి పెళ్లి తంతులో సమానత్వం కనిపిస్తుందని కొందరు కామెంట్లు పెడితే..వరుడు లేని పెళ్లిలో ఇంకా సమానత్వం ఏంటిరా బాబు అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియో చూసి చెప్పేయండి మరి.

అయితే .. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. అమ్మాయిలు రీల్స్ కోసం ఈ ప‌ని చేశారా లేక‌ నిజంగానే పెళ్లి చేసుకున్నారా అనే విష‌యం తెలియాల్సి ఉంది.