Poonam Kaur | ఓ యోధుడిగా ఓడిపోవడం మేలు..! పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు..!

Poonam Kaur | పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసింది తక్కువగానే అయినా.. తనదైన శైలిలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram)పై కామెంట్స్‌ చేస్తూ గుర్తింపును పొందింది.

Poonam Kaur | ఓ యోధుడిగా ఓడిపోవడం మేలు..! పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు..!

Poonam Kaur | పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసింది తక్కువగానే అయినా.. తనదైన శైలిలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram)పై కామెంట్స్‌ చేస్తూ గుర్తింపును పొందింది. ఈ ఇద్దరితో పూనమ్‌కి ఏం ఇబ్బంది, నష్టం కలిగిందో తెలియదు గానీ.. పూనమ్‌ కెరీర్‌ నాశనం అయ్యేందుకు ఇద్దరే కారణమనే ఆరోపణలున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చుతూ పూనమ్‌ కౌర్‌ ఇద్దరిపై కామెంట్స్‌ చేస్తూనే వస్తున్నది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియా వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే ఓ యోధుడిగా ఓడిపోవడం మేలు అంటూ కామెంట్‌ చేసింది.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, ఇందులో ఎవరి పేర్లను ప్రస్తావించకపోయినా కూటమి ప్రభుత్వంపైనేని.. ఇందులో పవన్‌ కల్యాణ్‌పైనే పలువురి పేర్కొంటున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌పై చర్చ సాగుతున్నది. ఈ క్రమంలోనే పూనమ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించింది. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌ చేశారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పూనమ్‌ పెట్టిన పోస్టును ఓ వర్గానికి చెందిన నేతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, పూనమ్‌ పెట్టింది ఎవరి ఉద్దేశించి ఆమెనే చెప్పాల్సిందే.