తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున రావూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పనబాక లక్ష్మి 4 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని, మిగతా అభ్యర్థుల్లో ఒకరికి కూడా రాజకీయ అనుభవం లేదని ఆయన అన్నారు.ప్రజలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని కష్టపడి పనిచేశానని, బడుగు బలహీన వర్గాల కోసం పనబాక పనిచేశారని గుర్తు చేశారు.‘‘బీసీలకు 33శాతం రిజర్వేషన్లు" ఇచ్చిన ఘనత టీడీపీది.జగన్‌ వచ్చాక రిజర్వేషన్లను 25శాతానికి తగ్గించాడు.బీసీలంటే సీఎం జగన్‌కు కోపం, ద్వేషం. నేను ఆదరణ పథకం […]

తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున రావూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పనబాక లక్ష్మి 4 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారని, మిగతా అభ్యర్థుల్లో ఒకరికి కూడా రాజకీయ అనుభవం లేదని ఆయన అన్నారు.ప్రజలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని కష్టపడి పనిచేశానని, బడుగు బలహీన వర్గాల కోసం పనబాక పనిచేశారని గుర్తు చేశారు.‘‘బీసీలకు 33శాతం రిజర్వేషన్లు” ఇచ్చిన ఘనత టీడీపీది.జగన్‌ వచ్చాక రిజర్వేషన్లను 25శాతానికి తగ్గించాడు.బీసీలంటే సీఎం జగన్‌కు కోపం, ద్వేషం. నేను ఆదరణ పథకం పెట్టా.. జగన్‌ ఒక్క పనిముట్టు ఇవ్వలేదు.టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీసీ అయిన సుధాకర్‌ను నియమించాం.వర్సిటీల వీసీలుగా జగన్‌కు ఇష్టమైన వారిని నియమించుకున్నాడు.జగన్‌రెడ్డి జమానాలో బీసీల ప్రాధాన్యత నేతి బీరకాయ చందమే.బీసీల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదు.నవరత్నాలు కాదు.. నవమోసాలు చేశారు.నవగ్రహాల చుట్టూ తిరిగిన మీ పాపాలు పోవు.షెడ్యూల్డ్‌ కులాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?. ఎస్సీలకు విదేశీ విద్య, ఇన్నోవా కార్లు అందించాం.వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే ఏం చేశారని నిలదీయండి.వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది గోరంత.. దోచింది కొండత.ఎస్సీ, ఎస్టీ సంక్షేమం లేదు.. బీసీ సబ్‌ప్లాన్‌ లేదు.ఈ జగన్‌రెడ్డి వల్ల పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టింది.పేదల జేబులు గుల్ల చేసిన పెద్దమనిషి జగన్‌రెడ్డి అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు.