ఆంధ్రప్రదేశ్ పాల – ఏకరి కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

విధాత:తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పాల - ఏకరి కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి,నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారయణ మూర్తి… ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల, సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దిశగా పాలన కొనసాగిస్తున్నారు.పాల ఏకరిలను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో […]

ఆంధ్రప్రదేశ్ పాల – ఏకరి కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

విధాత:తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పాల – ఏకరి కార్పొరేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి,నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారయణ మూర్తి…

ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల, సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దిశగా పాలన కొనసాగిస్తున్నారు.పాల ఏకరిలను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో బిసిలగా గుర్తించారు.తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాల ఏకరికి ఓ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.సీఎం రాష్ట్రంలో విద్య,వైద్యంలో ఓ వినూత్న విప్లవం తెచ్చారు.పేదవాడు కరోనాగానీ ఏ అనారోగ్యమైన ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స పొందేలా చేశారు.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపరేఖలు మార్చారు..
అమ్మ ఒడి, విద్య దీవెన, ఫీజు రీంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ప్రతి పేదవాడి పిల్లవాడు విద్య అభ్యసించాలనేది సీఎం లక్ష్యం.రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారు..
ఓటు బ్యాంకు రాజకీయాలు మన సీఎంకు రావుఓటు బ్యాంకు కోసం బిసిలను వాడుకునే పార్టీలకు గత ఎన్నికలతోనే జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడారు.వెనుకబడిన వర్గాలను రాజకీయంగా , ఆర్థికంగా,సామాజికంగా ఎదుగుదలకు సీఎం కృషి చేస్తున్నారు…
సీఎం ఆశయంతో రాబోయే రోజుల్లో మీరే నాయకులుగా మారాలి..సీఎం లక్ష్యాన్నికి అనుగుణంగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను…

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

పాల ఏకరి కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యోద్దేశం మీ జాతి అభ్యున్నతి సాధించాలి అనేది ముఖ్యమంత్రి ఆశయం.వెనుకబడిన,బలహీన వర్గాలపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంకల్పం చాలా గొప్పది.ఈ వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి.బిసి వర్గాలను ఎన్నికలకు ముందు తప్ప… ఎన్నికల తరువాత పట్టించుకున్న వారులేరు.ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరే బిసి వర్గాలకు ఎన్నికల తరువాత తోడ్పాటుగా నిలబడిన నాయకులు.ఏలూరు సభలో బిసిలకు ఇచ్చినటువంటి హామీలను తూచతప్పకుండా అమలుచేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.