ఏపీ హైకోర్టులో కొలువులు

విధాత‌:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జీలకు, రిజిస్ట్రార్ లకు సహాయకులుగా ఉండే కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.37,100 వరకు వేతనం చెల్లించనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజుగా రూ. 750, రూ. […]

ఏపీ హైకోర్టులో కొలువులు

విధాత‌:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జీలకు, రిజిస్ట్రార్ లకు సహాయకులుగా ఉండే కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రటరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.37,100 వరకు వేతనం చెల్లించనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజుగా రూ. 750, రూ. 350ని చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్ట్స్/సైన్స్/కామర్స్ సబ్జెక్టులో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. దీంతో పాటు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నీకల్ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ నిమిషానికి 180 పదాలు, నిమిషానికి 150 పదాల ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు వయస్సు జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్ట్రార్(అడ్మినిస్ట్రేషన్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేలపాడు, అమరావతి, గుంటూరు-522237 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.