స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వకుండా తగిన నివేదిక కోసం కేసును
విధాత: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వకుండా తగిన నివేదిక కోసం కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సిజేఐకి నివేదించింది. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ద్ బోస్ తీర్పునివ్వగా, మరో జస్టీస్ 17ఏ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 17ఏను అన్వయించడంలో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నందున తగిన నివేదిక కోసం సీజేఐకి నివేదిస్తున్నామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వకుండా విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని సీజేఐనీ ధర్మాసనం కోరింది.