CM Chandrababu | సతీమణి కోసం చీరలు కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎక్కడంటే..

ఏపి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొనుగోలు చేశారు. బుధవారం విజయవాడ నగరంలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో కొద్దిసేపు ముచ్చటించారు

CM Chandrababu | సతీమణి కోసం చీరలు కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎక్కడంటే..

విధాత, విజయవాడ : ఏపి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొనుగోలు చేశారు. బుధవారం విజయవాడ నగరంలో చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో కొద్దిసేపు ముచ్చటించారు. స్టాళ్ల లో ఉత్పత్తులను పరిశీలించారు. ఒక స్టాల్ లో స్వయంగా రెండు చీరలు భార్య భువనేశ్వరి కోసం కొన్నారు.

ఈ చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలు కొనుగోలు చేసి ప్యాకింగ్‌ చేయించారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను ముఖ్యమంత్రి కొనుగోలు చేయడంలో స్టాల్‌ యజమాని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగారు. బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును ఆసక్తిగా తిలకించన ఆయన వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు.