విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై కమిటీ : ఎన్జీటీ ఉత్తర్వులు
విధాత,న్యూ ఢిల్లీ : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది. వేల చెట్లు కూల్చి రోడ్డు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, […]

విధాత,న్యూ ఢిల్లీ : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది. వేల చెట్లు కూల్చి రోడ్డు వేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. అనుమతించిన పరిధి దాటి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేశారని గుర్తించింది. అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధ్యులైన అధికారుల నుంచి పరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్ సభ్యులుగా ఉండనున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతంలో పర్యటించి మైనింగ్ అనుమతులు, పరిధి, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.