ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

విధాత:పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఊళ్లు ఖాళీ చేయమనడం భావ్యమా?ఈరోజు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న నిర్వాసితులను వారి గ్రామాలకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విచారకరం.బాధిత కుటుంబాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని ప్రయోగించి అర్ధాంతరంగా ఊళ్ళను ఖాళీ చేయమని బెదిరించడం దుర్మార్గం. నిర్వాసితులకు అండగా అఖిలపక్షం ఈరోజు పోలవరం ముంపు గ్రామాల్లో నిరసనలు చేపట్టింది.రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా స్పందించి పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించండి.ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ […]

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

విధాత:పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఊళ్లు ఖాళీ చేయమనడం భావ్యమా?ఈరోజు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న నిర్వాసితులను వారి గ్రామాలకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విచారకరం.బాధిత కుటుంబాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని ప్రయోగించి అర్ధాంతరంగా ఊళ్ళను ఖాళీ చేయమని బెదిరించడం దుర్మార్గం.

నిర్వాసితులకు అండగా అఖిలపక్షం ఈరోజు పోలవరం ముంపు గ్రామాల్లో నిరసనలు చేపట్టింది.రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా స్పందించి పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించండి.ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి.