AP DGP | ఏపీ కొత్త డీజీపీగా ద్వారక తిరుమల రావు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
AP DGP | ఏపీ కొత్త డీజీపీగా ద్వారక తిరుమల రావు నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సేవలుందిస్తున్నారు. ఆయనను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

AP DGP | ఏపీ కొత్త డీజీపీగా ద్వారక తిరుమల రావు నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా సేవలుందిస్తున్నారు. ఆయనను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ద్వారక తిరుమల రావు 1989 బ్యాక్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన 2021 జూన్ నెలలో ఆర్‌టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌పీ ఠాకూర్ పదవీకాలం మే 31న ముగియడంతో ఆయనకు అప్పటి వైఎస్ జగన్ సర్కారు ఆర్‌టీసీ ఎండీగా బాధ్యతలు అప్పగించింది.
ఆయన మూడేళ్లుగా ఆర్టీసీ ఎండీగా పని చేస్తున్నారు. అంతకుముందు రైల్వేశాఖలో డీజీపీగా పని చేశారు. విజయవాడ సీపీగానూ సేవలందించారు. గతంలో విజయవాడ సీపీగా చేసిన గౌతమ్ సవాంగ్‌ను జగన్ సర్కారు డీజీపీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీశ్‌కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్‌గా అవకాశం దక్కింది. దాంతో మే 6న ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం హరీష్ గుప్తా డీజీపీ కొనసాగారు. ఇటీవల ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతతం ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన అనంతరం సీనియర్లు అయిన అంజనా సిన్హా, ఎం ప్రతాప్ లను కాదని హరీష్ ను పోలీస్ బాస్‌గా ఈసీ నియమించింది. కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావును రాష్ట్ర డీజీపీగా నియమించింది. అలాగే తిరుమలరావు సీనియార్టీ ప్రకారం ఆయనకు పోలీస్ బాస్ అవకాశం దక్కింది. గత సర్కారుతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలక శాఖలను తప్పిస్తున్నది.
ఏపీ డీజీపీగా తిరుమలరావు
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (ఐపీఎస్) ఏపీ డీజీపీగా బదిలీ. pic.twitter.com/qdDI1YL5MY
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2024