పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిరసన దీక్ష

విధాత,విజయవాడ: పోలవరం నిర్వాసితుల సమస్యలపై ధర్నాచౌక్‌ వద్ద సోమవారం ఉదయం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష కొనసాగనుంది. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి జ్యోతుల నెహ్రు, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం నేత మధు, రైతు సమాఖ్య నాయకులు వడ్డే శోభనాదీశ్వరావు, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె.శ్రీనివాస్ త‌దిత‌రులు […]

పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిరసన దీక్ష

విధాత,విజయవాడ: పోలవరం నిర్వాసితుల సమస్యలపై ధర్నాచౌక్‌ వద్ద సోమవారం ఉదయం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష కొనసాగనుంది. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి జ్యోతుల నెహ్రు, టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం నేత మధు, రైతు సమాఖ్య నాయకులు వడ్డే శోభనాదీశ్వరావు, ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె.శ్రీనివాస్ త‌దిత‌రులు దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అటు దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు .పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగారు.