షిర్డీ సాయిబాబా భక్తులకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) శుభవార్త చెప్పింది. ఏపీలోని విజయవాడ నుంచి షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ‘సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ’ పేరుతో ప్యాకేజీని ప్రటించింది

IRCTC Tour | షిర్డీ సాయిబాబా భక్తులకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) శుభవార్త చెప్పింది. ఏపీలోని విజయవాడ నుంచి షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ‘సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ’ పేరుతో ప్యాకేజీని ప్రటించింది. మూడు రాత్రులు, నాలుగు రోజుల పాటు ప్యాకేజీలో టూర్‌ కొనసాగనున్నది. ప్రస్తుతం ఫిబ్రవరి 20న టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉన్నది.

పర్యటన సాగేదిలా..

టూర్‌ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు ఉదయం 10.15 గంటలకు పర్యటన మొదలవుతుంది. 17208 నెంబర్‌ రైలు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి వెళ్తుంది. పొద్దు, రాత్రంతా రైలులోనే ప్రయాణం కొనసాగుతుంది. రెండోరోజు ఉదయం 6.15గంటలకు నాగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా షిర్డీకి వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

ఫ్రెషప్‌ అయ్యాక సాయిబాబా ఆలయ దర్శనానికి వెళ్తారు. రాత్రి షిర్డీలోనే బస ఉంటుంది. మూడోరోజు ఉదయం శనిశింగనాపూర్‌ వెళ్తారు. అక్కడ దర్శనాలు పూర్తి చేసుకొని రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌కు చేరుకుంటారు. 17205 నెంబరు గల రైలులో విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు. నాలుగోరోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఎలా అంటే..?

పాక్యేజీలో కంఫర్ట్‌ క్లాస్‌, స్టాండర్డ్‌ క్లాస్‌ అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్‌ క్లాస్‌లో స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. ఒకరు నుంచి ముగ్గురు.. నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు కలిసి ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.14,930 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్‌ షేరింగ్‌కు రూ.9430, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.8,030 ధర ఉంటుంది. స్టాండర్డ్‌ క్లాస్‌లో సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.12,470, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.6,970, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.5,570. 5నుంచి11 ఏళ్ల పిల్లలకు సైతం ప్రత్యేకంగా ధర నిర్ణయించారు.

ఇక నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేస్తే కంఫర్ట్‌ క్లాస్‌లో ట్విన్‌ షేరింగ్‌కు రూ.8,240, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.7630, పిల్లలకు రూ.7320 చెల్లించాల్సి రానున్నది. స్టాండర్డ్‌ కేటగిరిలో ట్విన్‌ షేరింగ్‌కు రూ.5,780.. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.5,170, పిల్లలకు రూ.4,860 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే రైలు టికెట్‌, ఏసీ బస్సులో ప్రయాణం, ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ కవరవుతాయి. పూర్తి వివరాలుకు irctctourism.com వెబ్‌సైట్‌లో, 8287932312 (విజయవాడ రైల్వేస్టేషన్‌) నంబర్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ సూంచించింది.

Updated On 12 Feb 2024 4:58 AM GMT
Somu

Somu

Next Story