కరోనా కారణంగా రెండు నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం
విధాత,అమరావతి:కరోనా కారణంగా రెండు నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తారు..ఎల్లుండి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది..భవిష్యత్తు కార్యచరణపై పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తారన్నారు. రెండేళ్లుగా యువత ఎక్కువగా ఇబ్బంది పడింది.. ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది.యువతని సీఎం జగన్ మోసం చేశారు.. దీనిపై జనసేన ప్రశ్నిస్తోంది.నిరుద్యోగ యువత తో పవన్ కళ్యాణ్ సమావేశం […]

విధాత,అమరావతి:కరోనా కారణంగా రెండు నెలలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తారు..ఎల్లుండి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుంది..భవిష్యత్తు కార్యచరణపై పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తారన్నారు.
రెండేళ్లుగా యువత ఎక్కువగా ఇబ్బంది పడింది.. ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది.యువతని సీఎం జగన్ మోసం చేశారు.. దీనిపై జనసేన ప్రశ్నిస్తోంది.నిరుద్యోగ యువత తో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారు.ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది.. భవన నిర్మాణ కార్మికుల గురించి మొదటి నుండీ జనసేన పోరాటం చేస్తుంది.
రెండేళ్లు గడిచినా ఇసుక కొరత తీరలేదు.. ఇల్లు కట్టుకోలేక ప్రజలు పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.. భవన నిర్మాణ కార్మికుల నిధి 500 కోట్ల నిధులు ఏమయ్యాయి..?
ఇరిగేషన్ వివాదాలు అనేవి నిజాయితీ గా వచ్చాయా రాజకీయ కారణాల వల్ల వచ్చాయా ఆలోచించాలి..ఇద్దరు సీఎంలు మా మధ్య సఖ్యత ఉంది సమస్యలు పరిష్కరించుకుంటాం అన్నారు.. ఇప్పుడెందుకు అలా చెయ్యడం లేదు..రెండు రాష్ట్రాల సీఎం ల పోరాటంపై అనుమానాలు కలుగుతున్నాయి..విభజన సమయంలోనే నీటి విబేధాలు వస్తాయని ఊహించామన్నారు.