11 లేదా 12 న బంగాళాఖాతం లో అల్పపీడనం!..నేడు కోస్తాలో భారీవర్ష సూచన
విధాత,విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని […]

విధాత,విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రుతుపవనాలు బలహీనంగా ఉన్న సమయంలో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 7 సె.మీ, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.