తూర్పుగోదావరిలో నేడు రేపు వర్షాలు

విధాత: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో నేడు రేపు తేలిక పాటి నుండి అక్కడక్కడా భారీ వర్షపాతంతో, తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీచనున్నట్లు వెలువడిన వాతావరణ హెచ్చరిక దృష్ట్యా మత్స్యకారులెవరూ సముద్రవేటకు వెళ్లవద్దని ఇన్చార్జి కలెక్టర్ డా.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు, పెనుగాలల వల్ల అత్యవసర సేవలకు, జనజీవనానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలతో సంసిద్ధంగా ఉండాలని […]

తూర్పుగోదావరిలో నేడు రేపు వర్షాలు

విధాత: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో నేడు రేపు తేలిక పాటి నుండి అక్కడక్కడా భారీ వర్షపాతంతో, తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీచనున్నట్లు వెలువడిన వాతావరణ హెచ్చరిక దృష్ట్యా మత్స్యకారులెవరూ సముద్రవేటకు వెళ్లవద్దని ఇన్చార్జి కలెక్టర్ డా.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

భారీ వర్షాలు, పెనుగాలల వల్ల అత్యవసర సేవలకు, జనజీవనానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలతో సంసిద్ధంగా ఉండాలని రక్షణ, సహాయక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.