టీడీపీ ప్రభుత్వంలో బండెడు బకాయిలు..మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ
విధాత:అనంతపురం జిల్లా పరిశ్రమల స్థాపనకు అన్నిరకాలుగా అనుకూల ప్రాంతమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ వెల్లడించారు. అయినప్పటికీ గత ప్రభుత్వం ఉట్టి మాటలతోనే పరిశ్రమల పేరుతో అనంత జిల్లాను మరింత వెనకపడేలా చేసిందని ఆయన అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలు సహా అనేక రంగాలలో బకాయిలను పెట్టి టీడీపీ ప్రభుత్వం గారడీకే పరిమితమైందని మంత్రి శంకరనారాయణ ఆరోపించారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా జిల్లాలో పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి ఉందని మంత్రి శంకరనారాయణ స్పష్టం చేశారు. ఈ […]

విధాత:అనంతపురం జిల్లా పరిశ్రమల స్థాపనకు అన్నిరకాలుగా అనుకూల ప్రాంతమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ వెల్లడించారు. అయినప్పటికీ గత ప్రభుత్వం ఉట్టి మాటలతోనే పరిశ్రమల పేరుతో అనంత జిల్లాను మరింత వెనకపడేలా చేసిందని ఆయన అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలు సహా అనేక రంగాలలో బకాయిలను పెట్టి టీడీపీ ప్రభుత్వం గారడీకే పరిమితమైందని మంత్రి శంకరనారాయణ ఆరోపించారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా జిల్లాలో పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి ఉందని మంత్రి శంకరనారాయణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐ.టీ, నైపుణ్యాభివద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సహా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివద్ధి) డా.ఏ.సిరి, సబ్ కలెక్టర్ నవీన్, కదిరి ఆర్డీవో వెంకటరెడ్డి, సీఎంవో ప్రత్యేక అధికారి హరికష్ణ,జిల్లా అధికార యంత్రాంగం, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.