ఫైబర్ నెట్‌పై 121 పైసల అవినీతినీ నిరూపించలేరు
విధాత: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై అవినీతి బురద చల్లే కార్యక్రమానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సీఐడీని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నారని ఆయన విమర్శించారు. తెదేపా పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బురద చల్లిన జగన్ రెడ్డి.. ఏ ఒక్కటీ రుజువు కాకపోవటం వల్ల అసహనంతో ఫైబర్ నెట్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 121 కోట్ల అవినీతి […]

విధాత: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై అవినీతి బురద చల్లే కార్యక్రమానికి జగన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సీఐడీని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నారని ఆయన విమర్శించారు. తెదేపా పాలనలో రూ.6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బురద చల్లిన జగన్ రెడ్డి.. ఏ ఒక్కటీ రుజువు కాకపోవటం వల్ల అసహనంతో ఫైబర్ నెట్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 121 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్న గౌతమ్ రెడ్డి 121 పైసల అవినీతి కూడా నిరూపించలేరని పట్టాభి సవాల్ చేశారు.