జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా
విధాత,హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.రఘురామ కృష్ణరాజు,జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన విషయం తెలిసిందే. విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ […]

విధాత,హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. దీంతో విచారణను ఈ నెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.రఘురామ కృష్ణరాజు,జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన విషయం తెలిసిందే. విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ గతంలో కోర్టుకు వివరించింది. అయితే తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి సీబీఐ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.