దేశమంతా జగన్ వైపు చూస్తోంది..ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

విధాత:దేశమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు, ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో మంగళవారం 41, 42 డివిజన్లలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ రెండు డివిజన్లలోని లబ్ధిదారులకు ఆయన పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని […]

దేశమంతా జగన్ వైపు చూస్తోంది..ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

విధాత:దేశమంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు, ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో మంగళవారం 41, 42 డివిజన్లలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ రెండు డివిజన్లలోని లబ్ధిదారులకు ఆయన పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని కితాబును ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలలో 97 శాతం అమలు చేశారని పేర్కొన్నారు.

జిల్లాలో 30 వేల ఇంటి స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పేదలకు స్థలాలు కొనడం సాధ్యంకాదని, అంకణం లక్ష రూపాయల వరకు పలుకుతోందని, అందుకే కరోనా సమయంలో ఆదాయం లేకున్నా ఇళ్లస్థలాలు ఇస్తున్నామని తెలిపారు. ఇది పేదలకు స్థిరాస్తి అవుతుందని, బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే పెన్షన్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్య ,ఆరోగ్యం మీద మన రాష్ట్రమే ఎక్కువగా ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. వయసులో చిన్నవాడైనా జగన్మోహన్రెడ్డిని 20 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగేందుకు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, మల్లు సుధాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, చాట్ల నరసింహారావు, మధు, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఆర్డివో హుస్సేన్ సాహెబ్, మైనారిటీ నాయకులు హంజా హుసేని, యస్ఆర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.