వివేకా హత్య కేసు..సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ కస్టడీ
విధాత:వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశించింది.ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చింది.అధికారులు కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న సునీల్‌ను అదుపులోకి తీసుకుని.. సీబీఐ అతిథిగృహానికి తరలించారు.అతిథిగృహంలో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌ను 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి […]

విధాత:వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌కు 10 రోజుల సీబీఐ సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశించింది.ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చింది.అధికారులు కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న సునీల్‌ను అదుపులోకి తీసుకుని.. సీబీఐ అతిథిగృహానికి తరలించారు.అతిథిగృహంలో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌ను 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 4 నుంచి సునీల్ యాదవ్ కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తీసుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చింది.దీంతో అధికారులు కడప కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న సునీల్‌ను సాయంత్రం కస్టడీలోకి తీసుకున్నారు.వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ప్రమేయంపై చాలా అనుమానాలు ఉన్నాయని ఇప్పటికే రంగన్న వాంగ్మూలంలో కూడా సునీల్ పేరు ప్రస్తావించడంతో.. అతనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని సీబీఐ కోర్టులో వాదించింది.సునీల్ యాదవ్‌ను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని సీబీఐ.. కోర్టులో వాదించడంతో ఏకీభవించిన ధర్మాసనం.. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.