వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ యనమల
విధాత: జీవో నెం.217తో మత్స్యకార సొసైటీలను నిర్వర్యం చేయడం వాస్తవం కాదా,56 కార్పొరేషన్లపై హడావుడి తప్ప.. వాటికిచ్చిన నిధులెన్ని, చేసిన ఖర్చు ఎంత ..నేతన్న నేస్తం అంటూ రూ.లక్షకు పైగా అందే సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఎత్తేయడం వాస్తవం కాదా,ఆదరణ పనిముట్లు తుప్పుపట్టించారు,డిపాజిట్లను కూడా స్వాహా చేశారు.విదేశీ విద్య నిలిపివేసి బీసీ విద్యార్ధుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు,బీసీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైంది.బీసీ జనగణనపై జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు.సెంటు పట్టా పేరుతో […]

విధాత: జీవో నెం.217తో మత్స్యకార సొసైటీలను నిర్వర్యం చేయడం వాస్తవం కాదా,56 కార్పొరేషన్లపై హడావుడి తప్ప.. వాటికిచ్చిన నిధులెన్ని, చేసిన ఖర్చు ఎంత ..నేతన్న నేస్తం అంటూ రూ.లక్షకు పైగా అందే సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఎత్తేయడం వాస్తవం కాదా,ఆదరణ పనిముట్లు తుప్పుపట్టించారు,డిపాజిట్లను కూడా స్వాహా చేశారు.విదేశీ విద్య నిలిపివేసి బీసీ విద్యార్ధుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశారు,బీసీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైంది.బీసీ జనగణనపై జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు.సెంటు పట్టా పేరుతో బీసీల నుండి వేలాది ఎకరాలు లాక్కోవడం వాస్తవం కాదా.
మడ అడవుల్ని నాశనం చేసి మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీశారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి 16,800 మందిని రాజకీయాలకు దూరం చేశారు,కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు కోసం జగన్ రెడ్డి ఎందుకు నోరెత్తడం లేదు.రిజర్వేషన్లపై పలు రాష్ట్రాలు పోరాడుతుంటే.. జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది.బీసీ కార్పొరేషన్ నుండి నిధుల మళ్లించి కార్పొరేషన్ నిర్వీర్యం దుర్మార్గం కాదా.నిధులు, విధులు ఉన్న నామినేటెడ్ పదవులు సొంత వారికా.నిదులు విధులు కనీసం కుర్చీల్లేని పదవులు బీసీలకా.ఉచిత ఇసుకను రద్దుతో 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని దెబ్బతీశారు
రెండేళ్లలో 254 మంది బీసీలపై దాడులకు పాల్పడ్డారు,ఆస్తులు ధ్వంసం చేశారు.11 మంది టీడీపీ బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.