చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ హ‌వా..!

విధాత‌: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం.. నాలుగు జడ్పీటీసీల్లోనూ వైయస్సార్‌సీపీ గెలిచింది.రామకుప్పంలో వైయస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థికి 20419 ఓట్లురాగా, టీడీపీ అభ్యర్థికి 4301 ఓట్లు వచ్చాయి. ఈ జడ్పీటీసీ స్థానంలోనే 16118 ఓట్ల మెజార్టీ వచ్చింది.శాంతిపురం మండలంలో వైయస్సార్‌సీపీకి 22,526, టీడీపీకి 5,633 ఓట్లు వచ్చాయి. 16,893 ఓట్లు మెజార్టీ వచ్చింది.గుడిపల్లె జడ్పీటీసీలో వైయస్సార్‌సీపీకి […]

చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ హ‌వా..!

విధాత‌: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గంలోని కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం.. నాలుగు జడ్పీటీసీల్లోనూ వైయస్సార్‌సీపీ గెలిచింది.రామకుప్పంలో వైయస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థికి 20419 ఓట్లురాగా, టీడీపీ అభ్యర్థికి 4301 ఓట్లు వచ్చాయి. ఈ జడ్పీటీసీ స్థానంలోనే 16118 ఓట్ల మెజార్టీ వచ్చింది.శాంతిపురం మండలంలో వైయస్సార్‌సీపీకి 22,526, టీడీపీకి 5,633 ఓట్లు వచ్చాయి. 16,893 ఓట్లు మెజార్టీ వచ్చింది.గుడిపల్లె జడ్పీటీసీలో వైయస్సార్‌సీపీకి 15,859, టీడీపీకి 3,931 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 11,928.

కుప్పం మండలంలో వైయస్సార్‌సీపీకి 25,356, టీడీపీకి 7,998, మెజార్టీ 17,358 ఓట్లు. నాలుగు మండలాల్లో వైయస్సార్‌పీకి 83,890 ఓట్లు రాగా, టీడీపీకి కేవలం 21,863 ఓట్లు వచ్చాయి. వైయస్సార్‌సీపీ మెజార్టీ 62,297 ఓట్ల వచ్చింది.గడచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు 30,722 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అదే నాలుగు మండలాల్లో 62,297 ఓట్ల మెజార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి వచ్చింది.

ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది.కుప్పం మండలంలో 21 ఎంపీటీసీలు ఉండగా, ఒకచోట వైయస్సార్‌సీపీ ఏగ్రీవమైంది. ఒకచోట ఎన్నిక జరగలేదు.19 ఎంపీటీసీలకు వైయస్సార్‌సీపీకి 17, టీడీపీకి 2 వచ్చాయి. మొత్తంగా వైయస్సార్‌సీపీ 18, టీడీపీ 2 చోట్ల గెలిచాయి.
గుడిపల్లె మండలంలో 13 ఎంపీటీసీలకు ఒకచోట ఎన్నిక జరVýలలేదు. మిగిలిన 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచిన వైయస్సార్‌సీపీ.రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచిన వైయస్సార్‌సీపీ.శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 17 చోట్ల వైయస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలుపు.ఎన్నికలు జరిగిన 66 ఎంపీటీసీల్లో 63 వైయస్సార్‌సీపీ 3 చోట్ల టీడీపీ గెలిచాయి.చంద్రబాబు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి పాల‌య్యింది.వైయస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య వేయి ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం చెందింది.నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైయస్సార్‌సీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపొందాయి.కుప్పం నియోజకవర్గంలో 85శాతానికిపైగా పంచాయతీల్లో వైయస్సార్‌సీపీ ప్రభంజనం.