ఆయ‌న‌కు 38 మంది భార్య‌లు.. 100 గ‌దుల్లో కాపురం

ఆయ‌న‌కు 38 మంది భార్య‌లు.. 100 గ‌దుల్లో కాపురం

ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద కుటుంబం.. ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరంలో నివాస‌ముంటున్న ఆ అతిపెద్ద కుటుంబం ప‌ర్యాట‌కుల‌కు ఓ టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. ఎందుకంటే ఒకే ఇంట్లో 199 మంది నివాస‌ముంటూ.. త‌మ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారు. ఆ కుటుంబ పెద్ద 38 మంది భార్య‌ల‌ను క‌లిగి ఉండి, 100 గ‌దుల్లో 199 మందికి నివాసం ఏర్ప‌ర‌చ‌డం విశేషం.

మిజోరంలోని బాక్త‌వాంగ్ గ్రామానికి చెందిన జోయినా చ‌నా.. త‌న‌కు 17 ఏండ్ల వ‌య‌సున్న‌ప్పుడు తొలిసారి పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఒకే ఏడాదిలో 10 మందిని వివాహం చేసుకుని చ‌రిత్ర సృష్టించాడు. అలా తాను చ‌నిపోయే వ‌ర‌కు 38 మంది భార్య‌ల‌కు భ‌ర్త అయ్యాడు జోయినా చ‌నా. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న జోయినా.. 2021లో క‌న్నుమూశాడు. జోయినాకు 76 మంది పిల్ల‌లు 89 మంది గ్రాండ్ చిల్డ్ర‌న్స్ ఉన్నారు.

మొత్తం భార్య‌లు, పిల్ల‌లు, మ‌నువండ్లు, మ‌నువ‌రాళ్ల‌కు త‌న సొంత గ్రామంలోనే నాలుగు అంత‌స్తుల్లో 100 గ‌దుల‌ను నిర్మించాడు. అంద‌ర్నీ ఒకే భ‌వ‌నంలో ఉంచేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు జోయినా. అంద‌రూ కూడా ఉమ్మ‌డిగానే ఉంటున్నారు. రిమోట్ ఏరియాలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఆ భ‌వ‌నం ప‌ర్యాట‌కుల‌కు టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.

ఇక జోయినా త‌న బెడ్‌రూమ్‌కు ప‌క్క‌నే డార్మిట‌రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ డార్మిట‌రీలోనే భార్య‌లు ఉండేవారు. ఇక ఎల్ల‌ప్పుడు త‌న వ‌ద్ద ఏడు నుంచి ఎనిమిది మంది భార్య‌ల‌ను ఉండేలా జోయినా ప్లాన్ చేసుకునే వార‌ని స్థానికులు చెబుతున్నారు. అంద‌రూ క‌లిసి భోజ‌నం చేసేందుకు డైనింగ్ హాల్ కూడా ఉంది.

2011లో ఓ చానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జోయినా.. త‌న కుటుంబాన్ని విస్త‌రించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, మ‌రిన్ని పెళ్లిళ్లు చేసుకునేందుకు తాను రెడీ అని చెప్పారు. త‌న బాగోగులు చూసుకునేందుకు చాలా మంది ఉన్నార‌ని, ఇది త‌న అదృష్ట‌మ‌ని జోయినా పేర్కొన్నారు.