ఆర్ఎఫ్‌సీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మార్చి 10

ఆర్ఎఫ్‌సీఎల్‌లో 35 నాన్ - ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మార్చి 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆర్ఎఫ్‌సీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మార్చి 10

రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్స్ లిమిటెడ్(RFCL)లో 35 నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీ లోపు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. తెలంగాణ‌, నోయిడాలోని ప్లాంట్ల‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 35 పోస్టుల్లో అన్‌రిజ‌ర్వుడ్‌కు 23, ఎస్సీల‌కు 05, ఎస్టీల‌కు 01, ఓబీసీల‌కు 05, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు 01 పోస్టును కేటాయించారు.

పోస్టుల వివ‌రాలు

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ప్రొడ‌క్ష‌న్) -8

ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ప్రొడ‌క‌క్ష‌న్)-2

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(మెకానిక‌ల్) – 3

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఇన్‌స్ట్రుమెంటేష‌న్)-4

ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌) – 1

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(కెమిక‌ల్ ల్యాబ్) -1

ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ – 4

29-02-2024 నాటికి త‌గిన విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ, ఎక్స్-స‌ర్వీస్‌మెన్‌, డిపార్ట్‌మెంటల్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. త‌దిత‌ర వివ‌రాల కోసం https://www.rfcl.co.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.