ఆ జైలులో 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్..!
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైల్లో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది.

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైల్లో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వీరందరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై జైలు అధికారులు స్పందించారు. వీరందరికి ముందే హెచ్ఐవీ సోకిందని, జైల్లోకి వచ్చిన తర్వాత ఎవరికీ రాలేదని స్పష్టం చేశారు. అయితే ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఈక్రమంలో వాటిని శరీరంలోకి ఎక్కించుకునేందుకు ఒకరు వినియోగించిన సిరంజినే మరొకరు వాడడం వల్లే హెచ్ఐవీ సంక్రమించి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కానీ స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.
హెచ్ఐవీ సోకిన వారందరికీ హెచ్ఐవీ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గత ఐదేండ్లలో ఏ ఒక్కరూ హెచ్ఐవీ బారిన పడి చనిపోలేదని స్పష్టం చేశారు. 2023, డిసెంబర్‌లో ఖైదీలకు టెస్టులు నిర్వహించగా, పలువురు హెచ్ఐవీ బారిన పడినట్లు తేలింది.