37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం రేవంత్
కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో చురుగ్గా పని చేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్ పదవులకు ఎంపిక చేశారు. ఎమ్మెల్యే టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ల చైర్మన్ పదవులను కట్టబెట్టారు.
ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..
పటేల్ రమేశ్ రెడ్డి – టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
నేరెళ్ల శారద – మహిళా కమిషన్
నూతి శ్రీకాంత్ -బీసీ ఆర్థిక సంస్థ
రాయల నాగేశ్వర్ రావు – గిడ్డంగుల సంస్థ
ఎన్ . ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్
శివసేనా రెడ్డి – తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
ఈరవత్రి అనిల్ – ఖనిజాభివృద్ధి సంస్థ
జగదీశ్వర్ రావు – ఇరిగేషన్ డెవలప్‌మెంట్ సంస్థ
మెట్టుసాయికుమార్ – మత్స్య సహకార సంఘాల సమాఖ్య
గుర్నాథ్ రెడ్డి – పోలీసు గృహనిర్మాణ సంస్థ
జ్ఞానేశ్వర్ ముదిరాజ్ – విజయా డెయిరీ
బెల్లయ్య నాయక్ – గిరిజన సహకార ఆర్థిక సంస్థ
జంగా రాఘవ రెడ్డి -ఆయిల్ ఫెడ్
రియాజ్ – గ్రంథాలయ పరిషత్
నిర్మల(జగ్గారెడ్డి సతీమణి) – పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
ఎస్. అన్వేష్ రెడ్డి -విత్తనాభివృద్ధి సంస్థ
ఎం. విజయ బాబు – రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమాఖ్య
కాసుల బాలరాజు – ఆగ్రోస్
బండ్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి సంస్థ
మానాల మోహన్ రెడ్డి – రాష్ట్ర సహకార యూనియన్
చల్లా నరసింహా రెడ్డి – అర్బన్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
కే నాగు – గిరిజన సహకార, ఆర్థికాభివృద్ధి సంస్థ
జనక్ ప్రసాద్ -కనీస వేతన సలహా మండలి
ఎం. వీరయ్య – వికలాంగుల సంస్థ
నాయుడు సత్యనారాయణ – హస్తకళల సంస్థ
ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్, మైనార్టీల ఆర్థిక సంస్థ
మల్ రెడ్డి రాంరెడ్డి – రోడ్డు అభివృద్ధి సంస్థ
కాల్వ సుజాత – వైశ్య సంస్థ
పొదెం వీరయ్య – అటవీ అభివృద్ధి సంస్థ
ఎ ప్రకాశ్ రెడ్డి – రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్
కే నరేందర్ రెడ్డి – శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ
పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ
ఎన్. గిరిధర్ రెడ్డి -ఫిలిం డెవలప్‌మెంట్ సంస్థ
మన్నే సతీశ్ కుమార్ – రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి సంస్థ
జే జైపాల్ – అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంస్థ
ఈ వెంకట్రాం రెడ్డి – కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ
ఎంఏ ఫహీం – తెలంగాణ ఫుడ్స్