భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌లో 517 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగ‌ళూరు కాంప్లెక్స్ తాత్కాలిక ప్ర‌తిపాదిక‌న 517 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఖాళీల‌ను రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్‌లో 517 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం..

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగ‌ళూరు కాంప్లెక్స్ తాత్కాలిక ప్ర‌తిపాదిక‌న 517 ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఖాళీల‌ను రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. రెండేండ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రాజెక్టు అవ‌స‌రాలు, అభ్య‌ర్థి ప‌నితీరును బ‌ట్టి మ‌రో ఏడాది పొడిగించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మార్చి 13. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

2024, ఫిబ్ర‌వ‌రి 1వ తేదీ నాటికి బీఈ /బీటెక్ అభ్య‌ర్థుల‌కు 28 ఏండ్లు, ఎంఈ /ఎంటెక్ అభ్య‌ర్థుల‌కు 30 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. గ‌రిష్ఠ వ‌య‌సులో ఓబీసీ(ఎన్సీఎల్) అభ్య‌ర్థుల‌కు 3 ఏండ్లు, ఎస్సీ /ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 ఏండ్లు, పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు 10 ఏండ్ల స‌డ‌లింపు ఇచ్చారు.

ద‌ర‌ఖాస్తు రుసుము రూ. 150 +18 శాతం జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు. మొత్తం 517 పోస్టుల్లో అన్‌రిజ‌ర్వుడ్‌కు 210, ఓబీసీల‌కు 139, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు 52, ఎస్సీల‌కు 77, ఎస్టీల‌కు 39 పోస్టుల‌ను కేటాయించారు. సెంట్ర‌ల్ జోన్‌లో 68, ఈస్ట్ 86, వెస్ట్ 139, నార్త్ 78, నార్త్ ఈస్ట్ 15, సౌత్ జోన్‌లో 131 ఖాళీలు ఉన్నాయి. త‌దిత‌ర వివ‌రాల కోసం www.bel-india.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.