ఒకే ఒక్క నిమిషంలో తలతో 77 బాటిళ్ల మూతలను తీసేశాడు.. వీడియో
ఓ వ్యక్తి అసాధారణమైన పని చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం ఒకే ఒక్క నిమిషంలో తన తలతో 77 బాటిళ్ల మూతలను తీసేసి ఆశ్చర్యపరిచాడు.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమకు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకోసం చాలా మంది వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. అవి విజయవంతమైతే.. వారికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుంది. అలానే ఓ వ్యక్తి కూడా అసాధారణమైన పని చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. మరి అతను చేసిన ప్రయోగాన్ని చూస్తే మీరు కూడా షాకవ్వాల్సిందే. కేవలం ఒకే ఒక్క నిమిషంలో తన తలతో 77 బాటిళ్ల మూతలను తీసేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రషీద్.. ఏదైనా సాధించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకు తలతో బాటిల్స్ మూతలను తీయాలనుకున్నాడు. ఇంకేముంది.. సాధన చేసి.. అనుకున్న విజయాన్ని అందుకున్నాడు. నిమిషం సమయంలో 77 బాటిళ్ల మూతలను తలతో తీసి, గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ రికార్డును ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నెలకొల్పాడు రషీద్.
2020లో ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్ ప్రభాకర్ రెడ్డి.. నిమిషం సమయంలో 68 బాటిళ్ల మూతలు తలతో తీసి రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును మహ్మద్ రషీద్ అధిగమించాడు.