మనీ లాండరింగ్ కేసు: పాటియాల కోర్టుకు ప్రభాస్ హీరోయిన్
డిసెంబర్ 12కు విచారణ వాయిదా విధాత: 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురువారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. ఈకేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణను కోర్టు డిసెంబర్ 12కి వాయిదా వేసింది. అనంతరం ఆమె పాటియాల కోర్టు నుంచి వెళ్లిపోయారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను […]

- డిసెంబర్ 12కు విచారణ వాయిదా
విధాత: 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురువారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. ఈకేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణను కోర్టు డిసెంబర్ 12కి వాయిదా వేసింది. అనంతరం ఆమె పాటియాల కోర్టు నుంచి వెళ్లిపోయారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మొదటిసారి ఈ కేసులో నిందితురాలుగా పేర్కొన్నారు. ఈ కేసులో నవంబర్ 15న పాటియాల కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. రూ.50వేల సొంత పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పెషల్ జడ్జ్ శైలేంద్ర మాలిక్ తీర్పు చెప్పారు.
ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ నుంచి జాక్విలిన్ కోట్ల రూపాయల విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. రూ.5 కోట్ల 71 లక్షల విలువ చేసే బహుమతులను చంద్రశేఖర్ మోసపూరితంగా సంపాదించిన డబ్బు నుంచే ఇస్తున్నట్లు ఆమెకు ముందే తెలుసని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. ఢిల్లీ ఆర్థిక నేరాల దర్యాప్తు ప్రత్యేక విభాగం పోలీసులు ఈ కేసులో జాక్విలిన్ పాత్రపై ఇప్పటికే పలుమార్లు విచారణకు పిలిపించారు. జాక్విలిన్‌కు చెందిన 7 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈడీ అధికారులు జప్తు చేశారు