అంచెలంచెలుగా పెరుగుతున్న ఫాలోయింగ్.. అల్లు అర్జున్ మైన‌పు విగ్ర‌హం ఓపెనింగ్‌కి ముహూర్తం ఫిక్స్‌

అంచెలంచెలుగా పెరుగుతున్న ఫాలోయింగ్.. అల్లు అర్జున్ మైన‌పు విగ్ర‌హం ఓపెనింగ్‌కి ముహూర్తం ఫిక్స్‌

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త‌న ఫాలోయింగ్‌ని అమాంతం పెంచేసుకుంటున్నాడు. పుష్ప సినిమాకి ముందే బ‌న్నీకి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కాని ఆ త‌ర్వాత అది రెట్టింపు అయింది. పుష్ప సినిమా బన్నీకి జాతీయ అవార్డ్ తెచ్చిపెట్ట‌డంతో పాటు ఆయ‌న పేరు ప్ర‌ఖ్యాత‌లు మారుమ్రోగేలా చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో కూడా బ‌న్నీ ఫేమ్ సంపాదించ‌గా, ఆయ‌న‌కు ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైన‌పు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌బోతున్నారు. గ‌త ఏడ‌ది అక్టోబ‌ర్‌లో అల్లు అర్జున్ కొల‌త‌లు తీసుకున్నా ఇంత వ‌ర‌కు ఏర్పాటు చేసింది లేదు. అయితే ఆ విగ్రహం ఓపెనింగ్ కి ఇప్పుడు డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యింది.

మార్చి 28న రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ మైన‌పు విగ్రహావిష్క‌ర‌ణ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ఓపెనింగ్ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. అక్క‌డ త‌న మైనపు విగ్ర‌హంతో ఫొటో కూడా పోజులివ్వ‌నున్నాడు. అయితే న్యూస్ ని దుబాయ్ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, దానిని అల్లు అర్జున్ రీ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అయితే ఆ విగ్ర‌హం ఎలా ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న చేస్తున్నారు. బ‌న్నీకి ఫుల్ క్రేజ్ తెచ్చిన పుష్ప సినిమా గెట‌ప్ మాదిరిగా ఉంటుందా, లేక వేరే సినిమా పాత్ర‌ల మాదిరిగా ఉంటుందా అని ఆలోచ‌న‌లు చేస్తున్నారు. కాగా, టాలీవుడ్ హీరోలైన మ‌హేష్‌, ప్ర‌భాస్ మైన‌పు విగ్ర‌హాలు లండ‌న్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేయ‌గా, అల్లు అర్జున్‌ది దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. దుబాయ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న ఫస్ట్‌ ఇండియన్ స్టార్ మైన‌పు విగ్ర‌హం అల్లు అర్జున్ ది కావడం విశేషం.

ఇక బ‌న్నీ ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో అరుదైన ఘ‌న‌త సంపాదించాడు. ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన సౌత్ స్టార్ గా బన్నీ స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశాడు. సౌత్‌లో ఇప్పటి వరకు ఏ హీరోకి ఈ రికార్డ్ లేక‌పోవ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. సౌత్‌లో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ ఉన్న హీరోగా టాప్‌లో నిలిచాడు మ‌న ఐకాన్ స్టార్. పుష్ప‌2 రిలీజ్ త‌ర్వాత ఆయ‌న ఫాలోవ‌ర్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.