అతనితో అమలాపాల్ రెండో పెళ్లి.. ఇతనితో అయిన జీవితాంతం కలిసి ఉంటుందా?

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. టాలీవుడ్‌లో మంచి హిట్స్ అందుకున్న అమలాపాల్ ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. ఇక వీలున్నప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ మలయాళీ ముద్దుగుమ్మ రీసెంట్‌గా ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా మెలిగింది. బర్త్ డే పార్టీలో మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అందరి ముందే అడగగా, మొదట సర్ ప్రైజ్ అయిన అమలా.. ఆ తర్వాత నవ్వుతూ ఓకే చెప్పి ఏకంగా లిప్‌లాక్ కూడా ఇచ్చేసింది. ఇక ప్రపోజ్ చేసిన పది రోజులకే అతనితో కలిసి ఏడడుగులు వేసింది అమలాపాల్.
తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రెండో వివాహం చేసుకుంది అమలా పాల్. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న సాయంత్రం వీరి వివాహం ఘనంగా జరగగా, . తమ పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేసుకుంది అమలా పాల్. ‘రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను’ అంటూ తమ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు ఈ నూతన జంట. కాంతులు విరజిమ్మే అరెంజ్ మెంట్స్ మధ్య చాలా ఘనంగా అమలాపాల్ – జగత్ దేశాయి పెళ్లి జరగగా, ప్రస్తుతం వారి పెళ్లి పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా, గత నెల అక్టోబర్ 26న తన ప్రియుడు ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయిని అందరికి పరిచయం చేసింది అమలాపాల్. ఇది ఆమెకి రెండో వివాహం.
అమలాపాల్ 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకుంది. కొద్ది రోజులు ఈ జంట బాగానే ఉన్నా తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడం మంచిదని నిర్ణయానికి వచ్చి 2017లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఏఎల్ విజయ్ ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకోగా, అమలాపాల్ మాత్రం ఇన్ని రోజుల తర్వాత జగత్ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. కేరళలోని గ్రాండ్ హయత్ కొచ్చి బోల్గట్టి రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది. వారి పెళ్లికి ఏయే గెస్ట్‌లు వచ్చారనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. ఇక అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తుంది. పెళ్లి అయిన కూడా ఈ ముద్దుగుమ్మ కెరీర్ కంటిన్యూ చేయనుందని సమాచారం.