త‌న‌పై జ‌రిగిన దాడి గురించి తొలిసారి స్పందించిన అమ‌ర్‌దీప్.. నా అంతు చూస్తామన్నారు..!

త‌న‌పై జ‌రిగిన దాడి గురించి తొలిసారి స్పందించిన అమ‌ర్‌దీప్.. నా అంతు చూస్తామన్నారు..!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా తెలుగులో ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. తాజా సీజ‌న్‌లో ప్ర‌శాంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. కామ‌న్ మ్యాన్‌గా వచ్చి టైటిల్ ఎగ‌రేసుకుపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే ఫినాలే ఈవెంట్ పూర్త‌య్యాక ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ముసుగులో కొంద‌రు వ్య‌క్తులు అన్న‌పూర్ణ స్టూడియో ద‌గ్గ‌ర వీరంగం సృష్టించారు. ముఖ్యంగా అమ‌ర్ దీప కారు అద్దాల‌ని ప‌గ‌ల‌గొట్టి అత‌డిని, వారి కుటుంబ స‌భ్యుల‌ని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేశారు. అశ్వినీ, గీతూ రాయల్‌ కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్‌ అద్దాలను కూడా పగలగొట్టారు. అయితే అమర్‌ దీప్‌ కారు అద్దాలు ధ్వంసం చేయడం కారణంగా ఆ గ్లాస్‌ పీసెస్‌ వాళ్ల అమ్మపై పడి స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు సుమోటోగా కేసు న‌మోదు చేశారు.

కేసు విషయంలో పల్లవి ప్రశాంత్‌కు 41 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నోటీసులు పంప‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక పల్లవి ప్రశాంత్‌తోపాటు మరికొంత మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈరోజు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇదిలా ఉంటే త‌మ‌పై దాడి జ‌రిగిన త‌ర్వాత అమ‌ర్ దీప్ త‌ల్లి ఓ వీడియో విడుద‌ల చేసి చాలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక తాజాగా అమ‌ర్ స్పందించారు. త‌న‌కు ల‌భించిన స‌పోర్ట్ ప‌ట్ల చాలా సంతోషంగా ఉంద‌ని, కాక‌పోతే తాను ఇంటికి వచ్చే సరికి ఫ్యామిలీని రోడ్డుపై నిల్చోపెట్టడం చాలా బాధగా ఉందని వెల్లడించారు. న‌న్ను ఏమైన‌ అనండి, తిట్టండి, నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టండి, నష్టం లేదు, కాని అమ్మ విషయంలో అలా చేయడం, ఫ్యామిలీ గురించి అలా మాట్లాడటం సరికాదని హెచ్చరించాడు.

అలాంటి స‌మ‌యంలో ఏదైనా జరగరానిది జరిగితే, ఫ్యామిలీకి హాని కలిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు అమర్‌. అదే జరిగే, తాను ఎలా రియాక్ట్ అవుతానో, తన లైఫ్‌ ఏం అవుతుందో చెప్పలేనని హెచ్చరించాడు అమర్‌. మన ఇంట్లో ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుందన్నారు. జరగరానిది ఏదైనా జరిగితే, డబ్బు పోతే, కప్‌పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. కానీ మనిషిపోతే తిరిగి రానని, దయజేసి ఎప్పుడూ, ఎవరి వద్ద ఇలా చేయకండి అని అమ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.