మళ్లీ జబర్ధస్త్‌లోకి అనసూయ..ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుంది అంటే..!

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అలానే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. న్యూస్ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి, ఆ తర్వాత నటిగా మారి అక్కడ నుండి బుల్లితెర యాంకర్‌గా టర్న్ తీసుకొని అక్కడ అదరగొట్టి ఇప్పుడు నటిగా తెగ సందడి చేస్తుంది. `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికీ అనసూయని రంగమ్మత్తగానే పిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వెండితెరపై అనసూయ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. `పుష్ప`, `విమానం`, `ప్రేమ విమానం` చిత్రాల్లో అనసూయ పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి.
ప్రస్తుతం అనసూయ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. అయితే బుల్లితెరపై ఈ అమ్మడిని చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా `జబర్దస్త్` మానేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. ఎంతో మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఓ టీవీ ఛానెల్‌లో స్పెషల్ షోతో సందడి చేయబోతున్నట్టు చెప్పిన అనసూయ తాజాగా కూడా మరో హింట్ ఇచ్చింది. తను టీవీలోకి రావాలని ఎవరు కోరుకుంటున్నారు అని పోల్ నిర్వహించగా, అందులో 82 శాతం మంది తాను బుల్లితెరపై సందడి చేయాలనే కోరుకుంటున్నారు.
అనసూయ ఆ రెస్పాన్స్ చూసి షాక్ అవుతూ వాహ్ అంటూ రియాక్ట్ అయింది. ఇక ఆ తర్వాత ఏ షో చేయాలని పోల్ నిర్వహించగా, అందులో జబర్ధస్త్ అని చాలా మంది చెప్పడంతో దీని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఎమోజీలని పోస్ట్ చేసింది అనసూయ. ఇక ఈ అమ్మడు స్టార్ మా కోసం ఓ షో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ స్పెషల్ షోని ఇప్పటికే ప్లాన్ చేసినట్టు తెలుస్తుండగా, దానికి సంబంధించిన అప్‌డేట్ ఈ భామ త్వరలోనే ఇవ్వబోతుందని తెలుస్తుంది. అనసూయ బుల్లితెర ఎంట్రీ ఇస్తే అభిమానులకి కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ దక్కడం ఖాయం.