మూడోసారి ప్రేమ‌లో ప‌డ్డ స‌ల్మాన్ సోద‌రుడు.. ఈ సారి ఎవ‌రితో అంటే..!

  • By: sn    breaking    Dec 22, 2023 11:24 AM IST
మూడోసారి ప్రేమ‌లో ప‌డ్డ స‌ల్మాన్ సోద‌రుడు.. ఈ సారి ఎవ‌రితో అంటే..!

సినీ ఇండ‌స్ట్రీలో సెల‌బ్రిటీలు ఎప్పుడు ఎవరితో ప్రేమ‌లో ప‌డ‌తారో చెప్ప‌డం చాలా క‌ష్టం. అప్పుడే ప్రేమ అంటారు, అంత‌లోనే బ్రేక‌ప్ అంటారు. ఇంకొంద‌రు అయితే పెళ్లి చేసుకొని కొన్నాళ్లకి విడాకులు తీసుకుంటున్నారు. ఈ విష‌యాలు కొంత మంది అభిమానుల‌ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ గ‌తంలో చాలా ప్రేమాయ‌ణాలు న‌డిపించిన ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. ఇక సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు అర్బాజ్ ఖాన్ కూడా ప్రేమాయ‌ణాల‌తో హాట్ టాపిక్ అవుతున్నాడు. అర్భాజ్ ఖాన్ కొన్నేళ్ల క్రితం మ‌లైకా అరోరాని వివాహం చేసుకొని ఆమె నుండి విడిపోయాక జార్జియా ఆండ్రియానితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేశాడు.

ఇక చాలా ఏళ్లుగా కలిసి ఉన్న అర్బాజ్-జార్జియా కొద్ది రోజుల క్రితం విడిపోవడం మరోసారి హాట్ టాపిక్ అయింది. వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉండ‌గా, ఎందుకు విడిపోయారో ఎవ‌రికి అర్ధం కాలేదు. అయితే వారి బ్రేక‌ప్ గురించి కొన్ని రోజుల క్రితం జార్జియా వెల్లడిస్తూ… ఏడాదిన్నర క్రితమే విడిపోయామని స్ప‌ష్టం చేసింది. ఆమె నుండి విడిపోయాక అర్బాజ్ జీవితంలోకి మరోసారి ప్రేమ చిగురించిందని వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఓ మహిళతో అర్బాజ్ డేటింగ్ చేస్తున్నాడు అని అంటున్నారు. అర్బాజ్ ఖాన్ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.. ఇప్పుడు ఈ ఇద్దరూ రిలేషన్స్ షిప్ లో సీరియస్‌గా ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది.

సినిమా సెట్స్‌లో అర్బాజ్ , షురా ఒక్క‌ట‌య్యార‌ని త్వ‌ర‌లోనే వారి పెళ్లిపై ఓ క్లారిటీ ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు. షురా మేకప్ ఆర్టిస్ట్ కాగా, ఆమె బాలీవుడ్ నటి రవీనా టాండన్ అలాగే ఆమె కుమార్తె రాషా తడాని కోసం పని చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక అర్బాజ్ ఖాన్ 1998లో మ‌లైకాని వివాహం చేసుకోగా, 2016 మార్చిలో విడిపోతున్నట్టు ప్రకటించారు. మలైకా అరోరా విడాకుల తర్వాత అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది మ‌లైకా. ఆతర్వాత అర్బాజ్ జార్జియా ఆండ్రియానితో రిలేషన్‌షిప్‌లో ఉండ‌గా, 2019 లో, అర్బాజ్ వారి సంబంధాన్ని అంగీకరించాడు. అయితే ఇటీవ‌ల ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాము ఏడాది క్రిత‌మే విడిపోయామ‌ని జార్జియా చెప్పుకొచ్చింది.