ఫిఫా ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

విధాత‌:ఫిఫా ఫుట్ బాల్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఉత్కంఠ పోరులో ఫ్రాన్స్ జట్టుపై పెనాల్టీ షూట్ ఔట్ లో నెగ్గింది. ఈ విజయంతో అర్జెంటీనా మూడోసారి విశ్వ విజేతగా అవతరించింది. చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠ పోరులో మొదట ఇరు జట్లు 2-2 స్కోర్ తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం ఇచ్చారు. ఈ టైం లో ఇరు జట్లు చెరో గోల్ చేశాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూట్ […]

ఫిఫా ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

విధాత‌:ఫిఫా ఫుట్ బాల్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఉత్కంఠ పోరులో ఫ్రాన్స్ జట్టుపై పెనాల్టీ షూట్ ఔట్ లో నెగ్గింది. ఈ విజయంతో అర్జెంటీనా మూడోసారి విశ్వ విజేతగా అవతరించింది.

చివరి దాకా నరాలు తెగే ఉత్కంఠ పోరులో మొదట ఇరు జట్లు 2-2 స్కోర్ తో సమంగా నిలిచాయి.
దీంతో అదనపు సమయం ఇచ్చారు. ఈ టైం లో ఇరు జట్లు చెరో గోల్ చేశాయి.

దీంతో మ్యాచ్ పెనాల్టీ షూట్ ఔట్ కు దారి తీసింది. పెనాల్టీ షూట్ ఔట్ లో అర్జెంటీనా వరుసగా 4 గోల్స్ చేసింది. ఫ్రాన్స్ 2 గోల్స్ మాత్రమే చేయడంతో అర్జెంటీనా వరల్డ్ చాంపియన్ గా నిలిచింది.