అషూ రెడ్డి చేసిన ప‌నికి చీపురుతో రెండు ఇచ్చుకున్న ఆమె త‌ల్లి.. వీడియో వైర‌ల్‌

  • By: sn    breaking    Nov 16, 2023 11:27 AM IST
అషూ రెడ్డి చేసిన ప‌నికి చీపురుతో రెండు ఇచ్చుకున్న ఆమె త‌ల్లి.. వీడియో వైర‌ల్‌

జూనియర్ స‌మంత‌గా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి మొద‌ట్లో డ‌బ్ స్మాష్ ద్వారా కొంద‌రికి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత మెల్లమెల్ల‌గా సోష‌ల్ మీడియా ద్వారా బిగ్ బాస్ షోలో ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ షోలో ఉన్న‌న్ని రోజులు త‌న అంద‌చందాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత అషూ రెడ్డి యాంక‌ర్‌గా, న‌టిగా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేసింది. కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వ‌ర్మ‌తో బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేసి మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. అయితే అషూ రెడ్డి త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై ఉండేలా చేస్తుంటుంది.తాజాగా అషూ త‌న ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసి మ‌రోసారి వార్త‌లలోకి ఎక్కింది.

అషూ రెడ్డి త‌న త‌ల్లితో క‌లిసి అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది. ఆ మ‌ధ్య త‌ను ప్ర‌గ్నెంట్ అంటూ త‌ల్లికి చెప్పి ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు ఎలా ఉంటాయో వీడియో ద్వారా చూపించింది. ఆ స‌మ‌యంలో అషూని వాళ్ల అమ్మ ఓ రేంజ్‌లో తిట్టిపోసింది. ఇక ఆ త‌ర్వాత ఓ కాస్ట్‌లీ బ్యాగ్ కొన్న‌ప్పుడు కూడా వాళ్ల అమ్మ ఎలా రియాక్ట్ అయిందో కూడా వీడియో ద్వారా చూపించింది. ఇక ఇప్పుడు త‌ను ఏదో చేయ‌బోతే త‌న త‌ల్లిచేత చీపురు దెబ్బ‌లు తిన్న‌ట్టుగా పేర్కొంది అషూ. అషూ రెడ్డి రీసెంట్‌గా ఒక వీడియో షేర్ చేయ‌గా, ఆ వీడియోలో తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అంటూ ఒక ఆడియోకి లిప్ సింక్ చేసింది. నేను అలిగినపుడు బ్రతిమాలాలి ,ఎక్కువగా షాపింగ్ కి తీసుకుని వెళ్ళాలి అంటూ వీడియోకి లిప్ సింక్ చేస్తున్న స‌మ‌యంలో వెన‌క నుండి ఆమె త‌ల్లి వ‌చ్చింది.

చీపురుతో అషురెడ్డిని రెండు దెబ్బలేసింది. తల్లి చేతిలో దెబ్బలు తిన్నా కూడా ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది అషురెడ్డి. ‘ఆ వాయిస్ నాదేనని భావిస్తోంది’ అంటూ తల్లిని ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్క‌డ విశేషం ఏంటంటే.. అషురెడ్డి వాయిస్ లానే ఆ వీడియోలో వాయిస్ ఉండ‌డం. ప్ర‌స్తుతం అషూ రెడ్డికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అషూ త్వ‌ర‌లో ‘ఏ మాస్టర్ పీస్’ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతోంది.