ఏంటి.. బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అవ్వ‌డం, విడాకులు కూడా అయిపోవ‌డం జ‌రిగిందా..!

ఏంటి.. బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అవ్వ‌డం, విడాకులు కూడా అయిపోవ‌డం జ‌రిగిందా..!

బిగ్ బాస్ సీజ‌న్‌7లో ప్ర‌స్తుతం ప‌ది మంది స‌భ్యులు ఉండ‌గా, వీరిలో ఎవ‌రు క‌ప్ కొడ‌తార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. ఎప్ప‌టిలానే అబ్బాయి ట్రోఫీ ద‌క్కించుకుంటాడా లేదంటే ఫ‌ర్ ఏ చేంజ్ అమ్మాయిలు కిరీటం సొంతం చేసుకుంటారా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ప్ర‌స్తుతం హౌజ్‌లో న‌లుగురు అమ్మాయిలు ఉండ‌గా, వారిలో అశ్విని త‌న అందంచందాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఈ అమ్మ‌డిని శోభ‌, ప్రియాంక టార్గెట్ చేస్తూ ఉండ‌డం అందుకు అశ్విని చాలా కుమిలిపోతూ క‌నిపిస్తుండ‌డం నెటిజన్స్‌కి కూడా ఆమ‌పై కొంత సింప‌తీ క్రియేట్ అయ్యేలా చేస్తుంది.

అయితే అశ్వినికి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ అమ్మ‌డికి 2013లోనే ఆమె త‌ల్లిదండ్రులు పెళ్లి చేశార‌ట‌. కాని భ‌ర్త‌తో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకొని ఆ త‌ర్వాత సినీ కెరీర్‌పై దృష్టి పెట్టిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌ల‌లో ఎంత నిజ‌ముందో తెలియ‌దు కాని ప్ర‌స్తుతం ఈ వార్త మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టిన అశ్విని గేమ్, టాస్క్‌ల‌లో అంత ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌క‌పోయిన‌ప్ప‌టికీ తన క్యూట్‌ లుక్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడిప్పుడే తన ఆటతీరును మెరుగుపరుచుకోవ‌డంతో పాటు డిఫెండ్ చేయ‌డం కూడా నేర్చుకుంటుంది.

బిగ్ బాస్ హౌజ్‌లో . అశ్విని కొందరితో మాత్రమే స్నేహంగా ఉంటుంది. భోలేతో ఆమెకు స్నేహం ఎక్కువ కుద‌ర‌గా, ఆమె క‌ష్ట‌న‌ష్టాల‌న్ని కూడా అత‌నితోనే షేర్ చేసుకుంటుంది. వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ భామ త‌మ త‌ల్లిదండ్రుల‌కి ఇష్టం లేక‌పోయిన ఈ ఫీల్డ్ లోకి వ‌చ్చింది. స్నేహితుల స‌ల‌హాతో ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. మహేశ్‌ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నా అక్క పాత్రలో మెరిసింది. అలాగే రాజా ది గ్రేట్‌ సినిమాలో రవితేజ తో కలిసి ఓ పాటలో హుషారైన స్టెప్పులేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక అమీర్ పేట్ లో,బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న సినిమాల్లో నటించింది. సినిమాల‌తో పెద్ద‌గా గుర్తింపు రాక‌పోయిన కూడా సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు బోలెడు ఫాలోయింగ్‌ ఉంది