ఆమె రోజుకు 100 సార్లు భావప్రాప్తి పొందుతుందట..! అది లేకుండానే..!!
స్త్రీ, పురుషులు శారీరకంగా కలిసినప్పుడు.. వారిద్దరూ ఎంతో అనుభూతి పొందుతారు. అయితే శృంగారంలో భావప్రాప్తి అనేది చాలా కీలకమైన అంశం.

స్త్రీ, పురుషులు శారీరకంగా కలిసినప్పుడు.. వారిద్దరూ ఎంతో అనుభూతి పొందుతారు. అయితే శృంగారంలో భావప్రాప్తి అనేది చాలా కీలకమైన అంశం. చాలా వరకు ఇద్దరు కూడా భావప్రాప్తి పొందుతారు. ఒక వేళ భావప్రాప్తి కలగకపోతే.. చాలా మంది స్త్రీలు మనోవేదనకు గురవుతారు. శృంగారం పట్ల వ్యామోహం కూడా తగ్గిపోతోంది. అయితే ఓ మహిళ మాత్రం రోజుకు 100 సార్లు భావప్రాప్తి పొందుతుందట. అది కూడా శృంగారంలో పాల్గొనకుండానే. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిలియన్ మోడల్ సుజీ కార్టెక్స్.. రోజుకు 100 సార్లు భావప్రాప్తి పొందుతున్నట్లు తెలిపింది. తాను శృంగారంలో పాల్గొనడం లేదని, ర్యాండమ్‌గా జరిగిపోతుందన్నారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో కూడా భావప్రాప్తి కలుగుతుండటంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్లు తెలిపారు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందన్నారు. రెండు మిస్ బమ్‌బమ్ విన్నర్ కూడా ఆమె.
ఈ కండీషన్‌ను స్పాంటినీయస్ క్లైమాక్స్ డిసార్డర్‌గా భావిస్తున్నట్లు కార్టెక్స్ పేర్కొన్నారు. గతంలో ఒకసారి జిమ్‌లో ఉన్నప్పుడు భావప్రాప్తికి గురయ్యానని, అప్పుడు అక్కడున్న 50 మంది తనవైపు ఒకరకంగా చూశారని గుర్తు చేశారు. కారులో వెళ్తున్నప్పుడు, పార్కులో జాగింగ్ చేస్తున్నప్పుడు, దంత వైద్యుడి వద్దకు వెళ్లిన సమయంలో కూడా భావప్రాప్తి కలగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఇదంతా ఆకస్మాత్తుగా జరిగిపోతుందన్నారు.
కొన్నిసార్లు గంటల తరబడి భావప్రాప్తి కలుగుతుందన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తానని తెలిపారు. అయితే రోజుకు 100 సార్లు భావప్రాప్తి కలిగినప్పటికీ, ఇది ఆనందదాయకం కాదన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా నొప్పిగా, చికాకుగా ఉంటుందని పేర్కొన్నారు. దీని నివారణకు పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీని చేస్తున్నట్లు కార్టెక్స్ తెలిపారు. ఇలా వరుసగా భావప్రాప్తి కలుగుతుండడంతో.. తన బాయ్‌ఫ్రెండ్ తనను అర్థం చేసుకోకుండా వదిలేసి వెళ్లిపోయాడని కార్టెక్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అనుభూతిని వైద్య పరిభాషలో నిరంతర జననేంద్రియ ప్రేరేపణ రుగ్మత అని అంటారు. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న మొదటి వ్యక్తి కార్టెక్స్ ఒక్కరే కాదు. అరిజోనాకు చెందిన ఓ మహిళ కూడా లైంగిక చర్యతో సంబంధం లేకుండా.. ఆకస్మిక భావప్రాప్తిని పొందినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆమె కేవలం రెండు గంటల్లోనే 180కి పైగా భావప్రాప్తి పొందారు.