హైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో సీఐ మృతి చెందారు.

హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో సీఐ మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. చార్మినార్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ సీఐ సాదిక్ అలీ బైక్‌పై వెళ్తుండగా, రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ సాదిక్ అలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని నారాయణగూడ ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఖాజావలీ మోహినుద్దీన్‌గా గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సీఐ బైక్‌ను ఢీకొట్టిన కారుపై ఓవర్‌స్పీడ్‌తో పాటు డేంజర్ డ్రైవింగ్ చలాన్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వినుషా శెట్టి అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్ ఉంది. అర్ధరాత్రి ప్రమాదం తర్వాత కారును స్పాట్‌లో వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ ఖాజావలీ మోహినుద్దీన్ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి మలక్‌పేట్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.