హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి దేవర సినిమా తీశారా?

హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి దేవర సినిమా తీశారా?

ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. ఈ మూవీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. ఈ ఏడాదిలోనే దేవ‌ర మూవీ ప్రేక్ష‌కుల‌కి ముందుకు రానుండ‌గా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి ఫీస్ట్‌గా ఉంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవ‌ల డెవిల్ ప్రమోషన్స్‌లో దేవర అనేది హాలీవుడ్ మూవీలా ఉంటుందని, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది జూజూబి అనేట్టుగా కళ్యాణ్ రామ్ మాట్లాడ‌డం మ‌నం చూశాం. ఆయ‌న కామెంట్స్ త‌ర్వాత ఇటీవ‌ల విడుదలైన దేవర గ్లింప్స్‌పై నెటిజన్స్ చాలా ప‌రిశోధ‌న‌లు చేశారు. చివ‌రికి ఇందులో కొన్ని షాట్స్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని తేల్చేశారు. హాలీవుడ్ చిత్రం వికింగ్స్ ఇంట్రో సాంగ్ నుంచి ఈ షాట్స్‌ను వాడాడని, ఉన్నది ఉన్నట్టుగా లేపేశాడంటూ కొరటాల మీద కొంద‌రు మండిప‌డుతున్నారు.

కొంప‌దీసి దేవర చిత్రాన్నిహాలీవుడ్ మూవీకి రీమేక్‌గా చేస్తున్నారా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి దేవ‌ర గ్లింప్స్ పై ఇప్పుడు కాపీ క్యాట్ అనే కామెంట్స్ చేస్తున్నారు. ఇది మీమర్స్‌కు ఫీడ్‌ లా మారుతోంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవ‌ర చిత్రం త‌న కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా నిలుస్తుంద‌ని, కొర‌టాల శివ చెప్ప‌డంతో అభిమానులు మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. ఇక కొరటాల శివ కూడా చిత్రాన్ని పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు.

దేవ‌ర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్‌లో జాన్వీ కపూర్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోందని, షాట్ బాగా వచ్చినా కూడా బెటర్ మెంట్ కోసం ఇంకా టేక్స్ చేస్తానని అడుగుతుంద‌ని బిగ్ బాస్ ఫేమ్ హిమజ తెలిపింది. ఆమె కూడా దేవర చిత్రంలో ఓ పాత్రను పోషిస్తోంది.ఇక‌ ఈ చిత్రం ఇదే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లోకి రాబోతోన్న సంగతి తెలిసిందే.దేవర చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.ఈ మూవీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.