సముద్రంలో రక్తపు కెరటాలతో దేవర గ్లింప్స్.. అద్దరగొట్టేశాడగా..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవర టీజర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం గ్లింప్స్ విడుదల చేశారు.మొన్నామధ్య నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ విడుదల చేయగా, ఇందులో ఎన్టీఆర్ తన ఆయుధాన్ని పట్టుకొని సముద్రంలో రక్తాన్ని కడుగుతూ కనిపించారు. ఆ రక్తంతో మొత్తం కెరటాలు అంతా ఎర్రగా కనిపించాయి. ఇక ఇది చూసిన ఆడియన్స్ కి 8న రాబోయే గ్లింప్స్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
కాగా ఈ గ్లింప్స్ ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మొత్తం 80 సెకన్లు ఉంది. ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ విధ్వంసం కనిపించింది. సముద్రాన్ని చూపించారు. ఆ సముద్రంలో ఓడ.. దానిపైకి దొంగలు దాడిచేయడం.. వారిపై తారక్ పోరాటం.. ఇదీ దేవర టీజర్ లో కనిపించిన ప్రధానమైన విషయాలు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఓ ఇంగ్లిషు పాటతో చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఇక గ్లింప్స్ చివరలో ఎన్టీఆర్ ఈ సముద్రం చేపల కంటే, రక్తాన్నే ఎక్కువ చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ ఓ డైలాగ్ పలికాడు. విజువల్ గా ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపించింది.
చూస్తుంటే ఎన్టీఆర్ యాక్షన్‌కి పెద్ద పీట వేశారని అనిపిస్తుంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బాగుంది. 2024 వేసవి ‘దేవర’దే అని నమ్ముతున్న వాళ్లకు ఈ టీజర్ ఉత్సాహాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ కి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. అభిమానులంతా కూడా అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఆర్ఆర్ఆర్‌ని మించి ఉండాలని అనుకుంటున్నారు. చూడాలి మరి ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో..!