టాలీవుడ్ హీరో కామెడీపై దినేష్ కార్తీక్ ప్రశంసలు.. ఫ్యాన్స్ ఖుష్

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోడి టాలెంట్‌కి ఫిదా కాని వారు లేరు. ఆ మధ్య మల్లారెడ్డి, ఆ తర్వాత ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ని ఇమిటేట్ చేసి వార్తలలో నిలిచాడు నవీన్ పొలిశెట్టి. అయితే ఈ కుర్ర హీరో అనుష్కా శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే ఫీల్ గుడ్ సినిమా చేసాడు.. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి రూ.50 కోట్ల వరకు వసూళ్లు కూడా వచ్చాయి. ఇక చిత్రంలో నవీన్ నటనపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. నటనతో అందరు ఎమోషనల్ అయ్యేలా కూడా చేశాడు.
ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండగా, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్రాన్ని రీసెంట్‌గా భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ వీక్షించాడు. అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీపై ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ… ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి రొమాన్స్ కామెడీ సినిమాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. సినిమా చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంది. ఇక హీరో నవీన్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకు వెళ్లాడు’ అని తెలియజేశాడు దినేష్ కార్తీక్.
ఇక దినేశ్ కార్తీక్ పోస్టుపై హీరో నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు దినేష్ కార్తీక్. ఈ వరల్డ్ కప్‌లో మీ కామెంటరీని ఇష్టపడుతున్నాను. లెట్స్ గో ఇండియా’ అని తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దినేష్, నవీన్‌ల మధ్య జరిగిన డిస్కషన్‌కి సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు మహేష్ బాబు దర్శకత్వం వహించగా, ఇందులో పవిత్రా లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, భివన్ గోమటం, నాజర్, తులసి, రోహిణీ, మహేష్, సోనియా దీప్తి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించగా, ఈ సినిమాతో నిర్మాతలు మంచి లాభాలనే రాబట్టారు.