మీ ఇంటి ఆవరణలో ఈ పండ్ల చెట్లు ఉన్నాయా..? అయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవట..!
పండ్ల మొక్కల పెంపకం విషయంలోనూ వాస్తు టిప్స్ పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇంట్లో అశాంతి ఏర్పడటం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు సంభవించడం వంటివి ఏర్పడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటి ఆవరణలో ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా.. ఆ ప్లేస్‌లో ఆ ఇల్లాలు పూల మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతుంది. కొందరైతే పూల మొక్కలతో పాటు పండ్ల చెట్లను కూడా పెంచుతుంటారు. ఈ చెట్ల ద్వారా ఆక్సిజన్ లభిస్తోంది. అంతేకాకుండా పండ్లు కూడా లభిస్తాయి. రెండు రకాల ఉపయోగాలు ఉండడంతో చాలా మంది ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలను పెంచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పండ్ల మొక్కల పెంపకం విషయంలోనూ వాస్తు టిప్స్ పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఇంట్లో అశాంతి ఏర్పడటం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు సంభవించడం వంటివి ఏర్పడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో ఏ పండ్ల మొక్కలు పెంచాలి.. ఏ పండ్ల మొక్కలు పెంచకూడదో తెలుసుకుందాం.
ఈ చెట్ల పెంపకంతో సమస్యలే..!
వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో రేగు, ఖర్జూరం, పైనాపిల్ చెట్లను పెంచకూడదు. వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తాయని పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చెట్లను పెంచొద్దని సూచిస్తున్నారు.
ఈ పండ్ల చెట్లతో సిరిసంపదలే..!
వాస్తు శాస్త్రం ప్రకారం.. దానిమ్మ, జామ, ఉసిరి, బొప్పాయి, కొబ్బరి, నారింజ, అరటి చెట్లను పెంచుకోవడంతో ఇంట్లో సిరిసింపదలు, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
మరి ఏ దిశలో పండ్ల చెట్లను పెంచాలి..?
చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇండ్లను నిర్మించుకుంటారు. బెడ్రూం, వంట గది విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ చెట్ల పెంపకం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇది సరైంది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలను తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలని సూచిస్తున్నారు. ఇలా పెంచడం వల్ల ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయని చెబుతున్నారు.