శనివారం ఏ దేవుళ్లకు పూజిస్తే మంచిదో తెలుసా..?
జ్యోతిశాస్త్ర నిపుణుల ప్రకారం.. వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. మరి శనివారం ఏ దేవుళ్లకు పూజిస్తే మంచిదో తెలుసుకుందాం..

హిందువులందరూ ప్రతి రోజు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. కొందరు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తే.. ఇంకొందరు తమ ఇండ్లలోనే పూజలు చేస్తుంటారు. కానీ ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలో చాలా మందికి తెలియదు. తమ మతం, విశ్వాసాల ప్రకారం దేవుడిని పూజించడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. అయితే, వారంలోని ఏడు రోజుల్లో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో.. శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి పూర్తిగా వివరించారు. జ్యోతిశాస్త్ర నిపుణుల ప్రకారం.. వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా. ఇందులో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్లను పూజించడం వల్ల మంచి పుణ్య ఫలం లభిస్తుంది. మరి శనివారం ఏ దేవుళ్లకు పూజిస్తే మంచిదో తెలుసుకుందాం..
వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం..
కలియుగ దైవం వేంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయస్వామి, శని దేవతల ఆరాధన ఉత్తమం. కుదిరితే ఆంజనేయ స్వామి, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షణలు చేస్తే దోషాలు పోతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
శనివారం శనిదేవునికి అంకితం..!
శనిదేవునికి అంకితమైన రోజు శనివారం. శని దేవుడు మన చర్యలకు తగిన ప్రతిఫలం ఇస్తాడని, లేదంటే శిక్షిస్తాడని ప్రజలకు బలమైన నమ్మకం. జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు ఎక్కువగా శనివారం పూజలు చేస్తారు. ఈ రోజున శని భగవంతుని దర్శనం పొందుతారు. ఈ రోజున శనిని ఆరాధించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయని చెబుతారు. పేదలకు అన్నదానం చేసి, ఆపదలో ఉన్నవారికి శని అనుగ్రహం పొందేందుకు సహాయం చేయండి. మీకు త్వరలో మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఈ రోజు శనికి నల్ల ఆవాలు, ధూపం, దీపం, పంచామృతం, పువ్వులు సమర్పించండి. నలుపు శనికి ఉత్తమమైన, ఇష్టమైన రంగు అని నమ్ముతారు. కాబట్టి, ఈ రోజున నల్లని దుస్తులు ధరించడం శుభప్రదం.