Exit Polls | గుజరాత్ మళ్లీ బీజేపీదే..! హిమాచల్‌ప్రదేశ్‌లో హస్తం – కమలం నువ్వానేనా..?
Exit Polls | గుజరాత్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. రెండు విడుతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం రెండో విడుత పోలింగ్ పూర్తయ్యాయింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కొనసాగగా.. దాదాపు 58.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ

Exit Polls | గుజరాత్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. రెండు విడుతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం రెండో విడుత పోలింగ్ పూర్తయ్యాయింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కొనసాగగా.. దాదాపు 58.68శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. గుజరాత్‌తో పాటు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది.
ఇక ఎన్నికల్లో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్వరాష్ట్రం కావడంతో మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. మరో వైపు ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లింది.
మరో వైపు పంజాబ్ ఎన్నికల జోష్‌తో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీల విధానాలను తూర్పారపడుతూ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గుజరాత్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి.
గుజరాత్‌లో కమల వికాసం..
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో మరోసారి బీజేపీ 17-148 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్‌కు 30-51 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 3-13 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
అయితే, గుజరాత్‌లో మెజారిటీ మార్క్ 92. గుజరాత్‌లో బీజేపీకి 128నుంచి 148, కాంగ్రెస్‌కు 30-42, ఆప్‌కు 2-10, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పీ మార్క్ (P-MARQ) అంచనా వేసింది. సీ-వోటర్స్ సంస్థ బీజేపీకి 128-140, కాంగ్రెస్ 31-43, ఆప్ 3-11, ఇతరులు 2-6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
రిపబ్లిక్ బీజేపీకి 128-149, కాంగ్రెస్ 30-42, ఆప్ 2-10, జన్‌కీ బాత్ సర్వేలో బీజేపీకి 117-140, కాంగ్రెస్‌కు 34-51, ఆప్‌కు 6-13, పీపుల్స్ పల్స్ బీజేపీకి 125-143, కాంగ్రెస్‌కు 30-48, ఆప్‌కు 3-7, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో..
హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి 34-39 సీట్లు, కాంగ్రెస్‌కు 28-33, ఆప్ స్థానంలో గెలుస్తుందని పీ-మార్క్ (P-MARQ) సర్వే అంచనా వేసింది. బీజేపీకి 32-40, కాంగ్రెస్‌కు 27-34 సీట్లు వస్తాయని జన్‌కీ బాత్ తెలిపింది. అలాగే బీజేపీకి 38, కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ-ఈజీటీ పేర్కొంది.
బార్క్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 20-25, ఆప్‌కు 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.యాక్సిస్-మై ఇండియా పోల్స్‌లో బీజేపీకి 24-34, కాంగ్రెస్‌కు 30-40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మరో వైపు టుడే చాణక్య హిమాచల్‌ప్రదేశ్‌లో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 33, బీజేపీకి 33, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.