Woman Molest | నాతో శృంగారం చేయ్.. హోట‌ల్ గ‌దిలో మ‌హిళ‌ను వేధించిన దిన‌స‌రి కూలీ

Woman Molest | నాతో శృంగారం చేయ్.. హోట‌ల్ గ‌దిలో మ‌హిళ‌ను వేధించిన దిన‌స‌రి కూలీ

Woman Molest | ఓ దిన‌స‌రి కూలీ పైపు స‌హాయంతో నాలుగో అంత‌స్తులోకి దూరి.. త‌న‌తో శృంగారం చేయాల‌ని మ‌హిళ‌ను వేధింపుల‌కు గురి చేశాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అహ్మ‌దాబాద్‌కు చెందిన ఓ 28 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌రోడాలోని ఓ హోట‌ల్‌లో ఉంటుంది. త‌మ ఇల్లును రినోవేష‌న్‌లో ఉండ‌టంతో వారు నెల‌న్న‌ర నుంచి ఆ హోట‌ల్‌లోనే ఉంటున్నారు. అయితే ఆ మ‌హిళ‌ను ఓ దిన‌స‌రి కూలీ గ‌మ‌నించాడు. హోట‌ల్ నాలుగో అంత‌స్తులో ఆమె ఉంటున్న‌ట్టు గ్ర‌హించాడు.

ఇక సోమ‌వారం తెల్ల‌వారుజామున 3:30 గంట‌ల స‌మ‌యంలో భ‌ర్త స్నాక్స్, టీ కోస‌మ‌ని గ‌ది నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. భ‌ర్త బ‌య‌ట‌కు వెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన దిన‌స‌రి కూలీ పైపు స‌హాయంతో నాలుగో అంత‌స్తు వ‌ర‌కు ఎక్కి, కిటికీ ద్వారా గ‌దిలోకి దూరాడు.

త‌న‌తో శృంగారం చేయాల‌ని మ‌హిళ‌ను వేధించాడు. ఆమె ప్ర‌తిఘ‌టించింది. గ‌ట్టిగా కేక‌లు వేసింది. దీంతో హోట‌ల్ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. భ‌ర్త కూడా వ‌చ్చేశాడు. కూలీ హోట‌ల్ సిబ్బంది, భ‌ర్త‌పై కూడా దాడికి పాల్ప‌డ్డాడు.

హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో, అక్క‌డికి చేరుకుని కూలీని అదుపులోకి తీసుకున్నారు. స‌ర్దార్‌న‌గ‌ర్‌కు చెందిన పార్థు ప‌టేల్‌గా అత‌న్ని గుర్తించారు పోలీసులు. భార్యాభ‌ర్త‌ల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.