హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో.. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో.. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజుల్లో కార్యాలయాలను యథావిధిగా నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ రోజు శివరాత్రి కారణంగా ముందే సెలవు ప్రకటించబడింది. కానీ ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా మధ్య మెట్రో రైల్ నిర్మాణానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. ఇక శని, ఆదివారాల్లోనూ వివిధ కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే వచ్చే వారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చేలోపు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.