24-03-2024 ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థికంగా లాభం..!
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటే మేలు. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు.

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటే మేలు. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ పోటీదారులతో అభిప్రాయ బేధాలు రాకుండా నడుచుకుంటే మేలు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ తల్లిగారి ఆరోగ్యం మీకు ఒకింత ఒత్తిడికి కలిగించవచ్చు. కోర్టు వ్యవహారాలు, స్థిర, చరాస్థుల కొనుగోలు సంబంధించిన విషయాలు వాయిదా వేస్తే మంచిది. విద్యార్థులు సమయం వృథా చేయకుండా సద్వినియోగం చేస్తే మంచిది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా మీ ప్రయత్నాలు ఫలించి మీరు విజయం పొందితే, మీ ప్రత్యర్థులు అపజయం చవి చూస్తారు. మీ కారణంగా కుటుంబసభ్యులు బాధపడే అవకాశముంది. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అంతటా ప్రతికూల పరిస్థితి ఉన్నందున ధైర్యంగా ఉండండి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి వ్యతిరేకత మిమ్మల్ని చికాకు పరుస్తుంది. ఈ కారణంగా స్థిరమైన నిర్ణయం తీసుకోలేక సందిగ్థంలో ఉంటారు. ఏది ఏమైనా,మధ్యాహ్నం తర్వాత అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా అనుకూలం.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. మీ నాయకత్వలక్షణాలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా చిటికెలో పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పనులు సత్వరమే పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. బలహీనతలను అధిగమించండి. వివాదాలను పట్టించుకోకపోవడం మేలు. సన్నిహితులను నొప్పించేలా ప్రవర్తించకండి. ఆర్థికంగా అనుకూలంగా లేదు. ఆలయ సందర్శన మేలు చేస్తుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని చికాకులు కంగారు పెడతాయి. స్నేహితులతో విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. న్యాయపరమైన విషయాల పట్ల జాగ్రత్త వహిస్తే మేలు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఇది ఒక తిరుగులేని రోజు అని చెప్పవచ్చు! ఈ రోజు ఎటు చూసినా జయమే! అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది. అందరూ ప్రశంసలతో మిమ్మల్ని ముంచెత్తుతారు. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించండి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఎటు చూసినా వ్యతిరేకత కనిపిస్తోంది. ఆరోగ్యం సహకరించదు. దైవ దర్శనం మేలు చేస్తుంది. మీ అనారోగ్యం మీ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా మీ సహోద్యోగులతో భేదాభిప్రాయాలు రావచ్చు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. యోగా, ధ్యానంతో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అనుకోని ఖర్చులు ఉండవచ్చు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సాధారణంగానే ఉంటుంది. మీ వ్యాపార భాగస్వాములతో, కస్టమర్లతో సత్సంబంధాలు పెంచుకోండి. అది మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా సంతృప్తికరమైన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురి అవుతారు.
మీనం
మీనరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మీ భాగస్వామితో చిన్నపాటి గొడవల కారణంగా ఒకింత దిగులుగా ఉంటారు. ఆందోళన చెందవద్దు. అన్నీ సర్దుకుంటాయి.